Bandi Bhagirath in police custody: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నెల 16న అరెస్టయిన భగీరథ్ ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే, విచారణ నిమిత్తం బండి భగీరథ్‌ను తమ కస్టడీకి ఇచ్చేందుకు అనుమతించాలని పోలీసులు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. విచారించిన కోర్టు బండి భగీరథ్‌ను మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో పేట్‌బషీరాబాద్ పోలీసులు ఆయన్ను కస్టడీలోరి తీసుకున్నారు. అనంతరం, మొయినాబాద్‌లోని అరణ్య ఫాంహౌస్‌కి భగీరథ్‌ను తీసుకెళ్లారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం అక్కడికి తీసుకెళ్లి విచారిస్తున్నారు.
Also read: Hyundai: షాకింగ్ న్యూస్.. పెరగనున్న హ్యూందాయ్ కార్ల ధరలు.. ఎప్పటి నుంచంటే?

