HomeTop StoriesBandi Bhagirath: బండి భగీరథ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. పోలీస్ కస్టడీకి కోర్టు గ్రీన్‌సిగ్నల్‌

Bandi Bhagirath: బండి భగీరథ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. పోలీస్ కస్టడీకి కోర్టు గ్రీన్‌సిగ్నల్‌

Bandi Bhagirath into Police Custody: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బండి భగీరథ్‌ పోక్సో కేసు వ్యవహారంలో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న భగీరథ్‌ను విచారించేందుకు మేడ్చల్‌/మల్కాజిగిరి పోక్సో స్పెషల్‌ కోర్టు అనుమతించింది. నిందితున్ని మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 16వ తేదీ రాత్రి పెట్ బషీరాబాద్ పోలీసుల చేతిలో అరెస్టయి ప్రస్తుతం చర్లపల్లి సెంట్రల్‌ జైలులో ఉన్న భగీరథ్‌ను పోలీసులు త్వరలోనే తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాలు సేకరించేందుకు కస్టడీ అవసరమన్న పోలీసుల వాదనతో ఏకీభవిస్తూ కోర్టు ఈ తుది నిర్ణయం తీసుకుంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా, వ్యక్తిగత ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తానంటూ బెదిరించాడనే బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. కేసు తీవ్రతను బట్టి పోలీసులు నిందితుడిపై బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో)తో పాటు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) కింద కఠినమైన సెక్షన్లను నమోదు చేశారు. ఇప్పటికే మేడ్చల్ జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రుల నుంచి దాదాపు 40 నిమిషాల పాటు రహస్య వాంగ్మూలాన్ని కూడా పోలీసులు రికార్డు చేశారు.

- Advertisement -

Also read: Suvendu Adhikari: మర్యాదగా వెళ్లిపోండి.. లేదంటే ఊహించలేరు..!! అక్రమ వలసదారులకు సువేందు అల్టిమేటం..!

నిజానిజాలను నిగ్గు తేల్చే పనిలో సిట్‌..

ఈ మూడు రోజుల పోలీసు కస్టడీ విచారణలో ప్రధానంగా డిజిటల్ ఆధారాల సేకరణపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దృష్టి సారించనుంది. నిందితుడి మొబైల్ ఫోన్లు, వాట్సాప్ చాట్లు, కాల్ డేటాను డిలీట్ చేసినట్లు వస్తున్న అనుమానాలపై పోలీసులు లోతుగా ఆరా తీయనున్నారు. బాధితురాలికి, నిందితుడికి మధ్య జరిగినట్లు చెప్తున్న సోషల్ మీడియా సంభాషణలు, ఎలక్ట్రానిక్ ఆధారాలను విశ్లేషించేందుకు ఫోరెన్సిక్ నిపుణుల సాయాన్ని కూడా తీసుకోబోతున్నారు. ఈ విచారణ ద్వారా కేసులోని మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News