HomeTop StoriesBandi Bhagirath: హైకోర్టుకి బండి భగీరథ్‌.. పోక్సో కేసు కొట్టివేయాలని పిటిషన్

Bandi Bhagirath: హైకోర్టుకి బండి భగీరథ్‌.. పోక్సో కేసు కొట్టివేయాలని పిటిషన్

Bandi Bhagirath POCSO Case: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.  తనపై పోలీసులు నమోదు చేసిన పోక్సో కేసును రద్దు చేయాలని, కేవలం రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టారని భగీరథ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కూడా కోర్టును అభ్యర్థించారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/himanta-biswa-sarma-sworn-in-as-assam-cm/

అయితే ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో, ఈ పిటిషన్ వెకేషన్ బెంచ్ ముందుకు వచ్చింది. దీనిపై మే 14న విచారణ జరిగే అవకాశం ఉంది.

Also Read: https://teluguprabha.net/crime-news/13-year-old-girl-died-after-falling-into-water-sump-in-miyapur/

మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీసులు.. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు మే 8న భగీరథ్‌పై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి.. తక్షణమే చర్యలు చేపట్టాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కేసు విచారణకు కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. మరోవైపు బాలిక, ఆమె తల్లి తనను డబ్బు కోసం బెదిరిస్తున్నారంటూ.. మే 8వ తేదీనే కౌంటర్‌ ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News