HomeTop StoriesBandi Bhagirath: బండి భగీరథ్ కేసులో బిగ్‌ ట్విస్ట్.. కస్టడీ పిటిషన్‌ విచారణ వాయిదా

Bandi Bhagirath: బండి భగీరథ్ కేసులో బిగ్‌ ట్విస్ట్.. కస్టడీ పిటిషన్‌ విచారణ వాయిదా

Police custody petition postponed: కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ పోక్సో కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. బండి భగీరథ్‌ కస్టడీకి అనుమతించాలని కోరుతూ.. పోలీసులు మల్కాజ్గిరి పోక్సో ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. సదరు కోర్టు విచారణను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది. భగీరథ్‌ను అదుపులోకి తీసుకుని విచారించేందుకు అనుమతించాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు మళ్లీ ఈనెల 26న విచారణ జరపనుంది. కాగా, మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో బండి భగీరథ్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు, నిందితుడిని పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసు అధికారులు కోర్టును ఆశ్రయించారు. అయితే, ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన అనంతరం, న్యాయస్థానం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

Also read: YSRCP MLC Ananthababu: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు చుక్కెదురు.. బెయిల్‌ పిటిషన్‌ రిజెక్ట్‌

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన కేసు..

బండి భగీరథ్‌ మైనర్ బాలికను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో పాటు ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదు పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి, తీవ్రమైన ‘పోక్సో’ (బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భగీరథ్‌ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు కావడంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది. కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు భగీరథను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు పోలీసులు కస్టడీ పిటిషన్ వేయగా.. ఇప్పుడు కోర్టు నిర్ణయంపై అందరి దృష్టి నెలకొంది. ఈనెల 26న కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతి ఇస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News