Bandi Bhagirath regular bail petition: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరణకు హైకోర్టు అనుమతించింది. మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఈనెల 8న పేట్‌బషీరాబాద్ పీఎస్‌లో భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 15న వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు.. తీర్పును రిజర్వు చేసింది. 16న భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరణకు ఆయన తరఫు న్యాయవాది హైకోర్టును అనుమతి కోరారు. న్యాయవాది విజ్ఞప్తి మేరకు హైకోర్టు ఇవాళ ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. బండి భగీరథ్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. దీంతో, ఈ తీర్పు భగీరథ్‌కు కాస్త ఊరనిచ్చిందనే చెప్పవచ్చు.
Also read: Maruti Suzuki: కారు ప్రియులకు బిగ్‌షాక్.. పెరగనున్న మారుతీ సుజుకీ కార్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంతంటే?

