Bandi Sanjay fire on BRS and Congress: ప్రధాని నరేంద్ర మోదీ లేకపోతే తెలంగాణలో ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్‌ఎస్‌లపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Also Read: https://teluguprabha.net/telangana/pm-narendra-modi-speech-on-central-funds-to-telangana/
‘జై శ్రీరామ్’ నినాదంతోనే బీఆర్‌ఎస్ పార్టీని ఫామ్‌హౌస్‌కు పరిమితం చేశామని బండి సంజయ్ విమర్శించారు. ప్రధాని మోదీ లేకుంటే తెలంగాణ ప్రభుత్వం నడవదని.. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధులను ఢిల్లీకి మోస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘నిధులు ఇచ్చేది మనం, అభివృద్ధి చేసేది మనం’ అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో యాసంగి పంట కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదని బండి సంజయ్ ఆరోపించారు. రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాము ఏ మతాన్ని కించపరచలేదని.. కానీ తమ రాముడిని కించపరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. తాను ఏ రోజు తలవంచుకునే పనులు చేయలేదని బండి సంజయ్ అన్నారు. తనను నేరుగా ఎదుర్కోలేక ఏదేదో కుట్రలు చేస్తున్నారని.. రాజకీయంగా ఎదుర్కోలేక దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఫామ్‌హౌస్‌లో ఎలుకను కాదని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
Also Read: https://teluguprabha.net/national-news/pm-narendra-modi-alleges-congress-alliance-with-tvk/
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి విజయం అంత సులభంగా రాలేదని సంజయ్ అన్నారు. 300 మందికి పైగా కార్యకర్తలు బలిదానం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళంలో కూడా కాషాయ కార్యకర్తలపై దాడులు జరిగాయని ఆరోపించారు. త్వరలో కేరళం, తెలంగాణ రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

