HomeతెలంగాణBandi sanjay: బండి సంజయ్ తల్లికి గుండెపోటు.. ఆందోళనలో బీజేపీ శ్రేణులు

Bandi sanjay: బండి సంజయ్ తల్లికి గుండెపోటు.. ఆందోళనలో బీజేపీ శ్రేణులు

Bandi Sanjay mother suffers heart attack: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ తల్లి శకుంతలమ్మ (83) శుక్రవారం అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. కరీంనగర్‌లోని తన నివాసంలో ఉన్న సమయంలో ఆమెకు ఒక్కసారిగా గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై.. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అనంతరం, మెరుగైన వైద్యం కోసం ఆమెను హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో ఆమెకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. శకుంతలమ్మను పరీక్షించిన మెడికవర్ వైద్య బృందం, ఆమె గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్లు గుర్తించారు. వైద్యులు ఆమెకు స్టంట్ వేసి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు మెడికవర్‌ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Also Read: Pawan kalyan: తమిళనాడు పరిస్థితి వేరు.. ఇక్కడి పరిస్థితి వేరు.. ట్రోల్స్‌పై స్పందించిన పవన్ కళ్యాణ్

ఆందోళనలో బండి సంజయ్‌ అభిమానులు..

కాగా, తల్లి అనారోగ్య వార్త తెలిసిన వెంటనే బండి సంజయ్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న తల్లిని పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ తల్లికి గుండెపోటు వచ్చిందన్న వార్త తెలియడంతో బీజేపీ శ్రేణులు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా, ఇటీవల బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదవ్వడం, ఇప్పుడు ఆయన తల్లికి గుండెపోటు రావడం బండి సంజయ్‌ని కలవరపాటుకు గురిచేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News