Bandi Sanjay sensational comments: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో నమోదవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ అంశంపై సిట్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “సిట్ విచారణలో నా కొడుకు తప్పు చేసినట్లు తేలితే కచ్చితంగా శిక్ష పడాల్సిందే. నా సమయాన్ని సమాజానికే ఇచ్చాను. నా కొడుకుకు మాత్రం టైం ఇవ్వలేకపోయాను. నా కొడుకును క్రిమినల్‌గా చూపే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏ తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు. కానీ నేను నా కొడుకును సమర్ధించడం లేదు. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తాను. కోర్టు నిర్ణయాన్ని మేం శిరసావహిస్తాం. ఒకవేళ నా కొడుకు తప్పు చేసినట్లు తేలితే చట్ట ప్రకారం ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. నా భార్య సైతం దీన్నే సమర్థిస్తుంది. నేనున్నా లేకున్నా కార్యకర్తలకు చేతనైనంత సాయం చేస్తోంది.” అని అన్నారు.
Also Read: https://teluguprabha.net/top-stories/sit-notices-to-bandi-bhagirath/
నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినోళ్లను అస్సలు విడిచిపెట్ట..
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈరోజు నా కుటుంబానికి నిప్పంటించారు. ఆ నిప్పుతో అవినీతి వ్యవస్థను దగ్దం చేస్తా. అవినీతి, కుట్రలు చేసే గడీల బద్దలు కొడతాను. నన్ను, నా కుటుంబాన్ని, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినోడిని విడిచి పెట్టే ప్రసక్తే లేదు. కాషాయ జెండా పట్టి కష్టాలు పడుతూనే ఉన్నా. అయినా బాధపడను. దేశం కోసం ధర్మం కోసం పోరాడుతూనే ఉంటా. రాజకీయాల్లో, ప్రజా సేవలో బిజీలో పడి నా కొడుకుకు టైమివ్వకుండా నేను తప్పు చేశాను. తప్పు నాదే.. నన్ను క్షమించండి. తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు. దీన్ని నిరూపించుకోవాలని అతడికే చెప్పాను. నా చివరి శ్వాస వరకు హిందూ ధర్మం కోసమే పనిచేస్తాను.” అని బండి సంజయ్ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.

