HomeTop StoriesBandi Sanjay: మోడీ టూర్‌కు ముందు తెలంగాణ బీజేపీలో కలకలం.. బండి సంజయ్‌ కుమారుడిపై పోక్సో...

Bandi Sanjay: మోడీ టూర్‌కు ముందు తెలంగాణ బీజేపీలో కలకలం.. బండి సంజయ్‌ కుమారుడిపై పోక్సో కేసు

Bandi Sanjay son in POCSO case: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. బండి భగీరథ్‌ మైనర్ బాలికపై లైంగిక దాడి జరిపినట్లు వస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. అంతేకాదు, బ్లాక్‌మెయిల్-హనీట్రాప్ కుట్ర కూడా బండి భగీరథ్‌ను చుట్టుముడుతోంది. ఈ మేరకు ఆయనపై పోక్సో కేసు నమోదైంది. బండి సాయి భగీరథ్ తమ మైనర్ కూతురికి బలవంతంగా మద్యం తాగించి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పేట్ బషీరాబాద్ పోలీసులు బండి సాయి భగీరథ్‌పై తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ఎస్‌ సెక్షన్ 74, 75 తో పాటుగా పోక్సో యాక్ట్ సెక్షన్ 11 r/w 12 కింద బండి భగీరథ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సాయి భగీరథ్ చేసిన టార్చర్ తట్టుకోలేక, తీవ్ర మనస్థాపానికి గురైన తమ కుమార్తె ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించిందని మైనర్ తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో తెలిపారు. మరోవైపు, తనను లక్ష్యంగా చేసుకుని పెద్ద కుట్ర జరిగిందని బండి సాయి భగీరథ్ కరీంనగర్ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్‌లోని కొంపల్లికి చెందిన ఒక కుటుంబం రూ. 5 కోట్ల కోసం తనను టార్గెట్ చేసిందని భగీరథ్ తన ఫిర్యాదులో వెల్లడించారు. స్నేహితుల ద్వారా తనకు ఒక అమ్మాయి పరిచయమైందని.. ఆ పరిచయంతో తామిద్దరం కలిసి కొన్ని దేవాలయాలకు, పార్టీలకు కూడా వెళ్లామని ఫిర్యాదులో తెలిపారు. అయితే, ఇద్దరి మధ్య జరిగిన మెసేజ్‌లు, కొన్ని వీడియోలను ఆయుధంగా చేసుకుని ఇప్పుడు సదరు అమ్మాయి కుటుంబ సభ్యులు తనను బ్లాక్‌మెయిల్ చేస్తుందని భగీరథ్ తన ఫిర్యాదులో ఆరోపించారు.

- Advertisement -

Also read: https://teluguprabha.net/top-stories/aiadmk-chief-palaniswami-key-comments/

రూ. 5 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్‌ మెయిల్‌..

ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి.. లేదంటే రూ. 5 కోట్లు ఇవ్వాలంటూ వారు తనపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక, భయంతో తాను ఇప్పటికే వారికి రూ. 50 వేలు చెల్లించానని భగీరథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినప్పటికీ వారి డిమాండ్ తగ్గలేదని, రూ. 5 కోట్లు ఇవ్వాల్సిందేనని.. లేదంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ తనను మానసికంగా వేధిస్తున్నారని ఆయన పోలీసులకు తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కావాలనే పథకం ప్రకారం తనను హనీట్రాప్‌లోకి లాగి, భారీగా డబ్బు వసూలు చేయాలనే కుట్రతోనే ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని భగీరథ్ వాపోయారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also read: https://teluguprabha.net/telangana/vh-key-statement-on-pm-modi/

బండి సంజయ్‌ని నేరుగా ఎదుర్కోలేక..

అయితే, ఈ ఘటనపై బీజేపీ నేతలు నేరుగా స్పందించకపోయిన సోషల్ మీడియా వేదికగా బండి సంజయ్ అనుచరలు రియాక్ట్ అవుతున్నారు. బండి సంజయ్‌ని నేరుగా ఎదుర్కోలేక ఆయన కొడుకుపై పథకం ప్రకారం హనీట్రాప్ ఎర వేసి ఇలాంటి దారుణలకు పాల్పడుతున్నారని కామెంట్స్‌ చేస్తున్నారు. శూర్పణకల్ని ఎరవేస్తే.. లంకా దహనం తప్పదనే విషయాన్ని వారు మరిచిపోతున్నారని మండిపడుతున్నారు. మరోవైపు రేపు తెలంగాణలో మోదీ టూర్ ఉన్న క్రమంలో కొన్ని రాజకీయ శక్తులు కావాలనే ఇలాంటి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని బండి సంజయ్‌ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News