Bandla Ganesh: అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతూ.. మంచానికే పరిమితమైన పవన్ వీరాభిమాని కుటుంబానికి.. ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ మానవత్వంతో అండగా నిలిచారు. హన్మకొండకు చెందిన 17 ఏళ్ల నిరంజన్ అనే బాలుడు గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బండ్ల గణేష్ తక్షణమే స్పందించి.. తన ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ తరఫున రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. కష్టాల్లో ఉన్న పవన్ కల్యాణ్ అభిమానిని ఆదుకోవడానికి నిర్మాత బండ్ల గణేష్ ముందుకు రావడం, అలాగే నిరంజన్ చివరి కోరికను తీర్చేందుకు పవన్ కల్యాణ్ స్వయంగా హన్మకొండకు రావడం స్థానికంగా అందరి హృదయాలను కదిలిస్తోంది. నిరంజన్ త్వరగా కోలుకోవాలని, అతడి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.
ఆత్మీయంగా హత్తుకున్న పవన్: అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్న నిరంజన్.. పవన్ కల్యాణ్‌ను కలవాలని కోరుకున్నాడు. ఈ విషయాన్ని వరంగల్ జనసేన నాయకులు ఏపీ డిప్యూటీ సీఎంకు తేలియజేశారు. వెంటనే స్పందించిన పవన్ కల్యాణ్.. ఈ రోజు నేరుగా నిరంజన్ ఇంటికి వెళ్లారు. నిరంజన్ దీనస్థితిని చూసి పవన్ చలించిపోయారు. మంచంపై ఉన్న నిరంజన్ పక్కనే కూర్చుని.. ఆత్మీయంగా హత్తుకున్నారు. నుదిటిపై ముద్దుపెట్టి ధైర్యం చెప్పారు. చిన్నప్పటి నుండి తనపై ఉన్న అభిమానాన్ని నిరంజన్ వివరించగా పవన్ ఎమోషనల్ అయ్యారు. తనను స్థానికులంతా ‘చోటా గబ్బర్ సింగ్’ అని పిలుస్తారని నిరంజన్ చెప్పడంతో వాతావరణం కాస్త తేలికపడింది.
Also read-Pawan Kalyan: వీరాభిమాని దీనస్థితిని చూసి ఎమోషనల్ అయిన పవన్ కల్యాణ్

