HomeతెలంగాణBhatti Vikramarka: విద్యా రంగంలో పెట్టుబడులకు ఆర్థిక సాయం చేయండి.. కేంద్ర మంత్రిని కోరిన భట్టి..!

Bhatti Vikramarka: విద్యా రంగంలో పెట్టుబడులకు ఆర్థిక సాయం చేయండి.. కేంద్ర మంత్రిని కోరిన భట్టి..!

Bhatti Vikramarka meets Nirmala Seetharaman: తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. విద్యారంగంలో భారీ పెట్టుబడులు, మూలధన వ్యయాలకు అదనపు ఆర్థిక సాయం కోరారు. సాస్కీ పథకం కింద రూ.5 వేల కోట్ల ప్రత్యేక సాయం, విద్యారంగంలో పెట్టుబడులకు ఎఫ్‌ఆర్‌బీఎం మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి ఇప్పటికే రూ.4,208 కోట్లు మంజూరైన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు మరింత ఆర్థిక మద్దతు అవసరమన్నారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. 2014-2023 మధ్య ప్రత్యేక ప్రయోజన సంస్థల ద్వారా తీసుకున్న అప్పుల భారం, వాటి చెల్లింపుల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగిందంటూ నిర్మలా సీతారామన్‌ దృష్టికి తీసుకెళ్లారు.

- Advertisement -

Also read: Bandi Sanjay: అందుకే నాపై కుట్ర.. కేటీఆర్‌పై బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు

విద్యా రంగానికి భారీ స్థాయిలో పెట్టుబడులు..

ఇక, విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక వసతులు, మానవ వనరుల అభివృద్ధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో పెట్టుబడులు కొనసాగిస్తోందని వివరించారు. ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి మొత్తం రూ.30 వేల కోట్ల పెట్టుబడుల ప్రణాళిక రూపొందించిందని, దీనిలో రూ.21 వేల కోట్లతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల క్యాంపస్‌ల నిర్మాణం, మరో రూ.9 వేల కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, సాంకేతిక విద్యాసంస్థలు, డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధి చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News