HomeTop StoriesBirthday gift for KTR: కేటీఆర్‌కి వినూత్నంగా బర్త్‌డే గిఫ్ట్‌.. సర్కారు సన్నబియ్యాన్ని ర్యాపిడో చేసిన...

Birthday gift for KTR: కేటీఆర్‌కి వినూత్నంగా బర్త్‌డే గిఫ్ట్‌.. సర్కారు సన్నబియ్యాన్ని ర్యాపిడో చేసిన కాంగ్రెస్‌ నేత

హైదరాబాద్ (తెలుగు ప్రభ): తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ ద్వారా పేదల కడుపు నింపుతున్నామని ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయి కుమార్‌ తెలిపారు. ఇవాళ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ర్యాపిడిలో సర్కార్ సన్నబియ్యాన్ని పంపించారు. దేశంలో సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ అని గుర్తు చేశారు. ఒకప్పుడు సన్నబియ్యంతో వంట చేస్తే పండగ అనుకునేవారని, ఇప్పుడు ప్రతి పేదవాడు సన్నబియ్యంతో మూడు పూటలా తింటున్నారని పేర్కొన్నారు. సన్న బియ్యం పంపిణీ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణాలో ప్రతి ఇంట్లో పండగ జరిగేలా చేస్తున్నాడని కొనియాడారు. కేటీఆర్ నిరుపేద కుటుంబం ఇంటిలోకి వెళ్లి సన్న బియ్యంతో భోజనం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా, కాంగ్రెస్ సర్కారు అందిస్తున్న పథకాల గురించి తెలుసుకున్నందుకు సంతోషమన్నారు. అందుకే, సన్నబియ్యం ప్రాముఖ్యత తెలిపేందుకు 25 కేజీల సన్న బియ్యం కేటీఆర్ పుట్టినరోజు కానుకగా పంపుతున్నట్లు తెలిపారు. కేటీఆర్ ఇంటికి ఇలా ప్రతి నెల పంపిడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. ఈ ప్రజా ప్రభుత్వంలో అందరు సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారని, నిరుపేద కుటుంబం కళ్ళలో ఆనందం చూడటమే మా ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. ఈ సన్న బియ్యం అన్ని పార్టీల వారు, ఉన్నవాళ్లు లేనివాళ్లు అందరు తినొచ్చని, మా ప్రభుత్వం పథకాల సునామి దేశంలో ఎక్కడ లేవని గుర్తు చేశారు.

- Advertisement -

Also Read: Protest: నీట్ పేపర్ లీకేజీపై ఓయూలో తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం సంఘీభావ ర్యాలీ..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News