HomeతెలంగాణBJP: తెలంగాణపై బీజేపీ గురి.. జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహరచన!

BJP: తెలంగాణపై బీజేపీ గురి.. జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహరచన!

Ramchander Rao: తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులన్నీ సమష్టిగా పనిచేస్తున్నాయని తెలంగాణ బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు స్పష్టం చేశారు. అమెరికాలోని న్యూజెర్సీ రాయల్ అల్బర్ట్ హాల్‌లో ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ (యూఎస్ఏ)’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.

- Advertisement -

తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే: రానున్న జీహెచ్ఎంసీ మరియు శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తామని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం తథ్యమని రాంచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీసిందని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ రెండు పార్టీల వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తిగా ఎదిగిందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో కేవలం 75 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా ఎన్డీఏ హయాంలో వాటిని 150కి పెంచి ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, వందే భారత్ రైళ్లు, ఆయుష్మాన్ భారత్ వంటి సంక్షేమ పథకాలతో పాటు ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి సాహసోపేత నిర్ణయాలను రాంచందర్‌రావు ప్రస్తావించారు.

Also Read-Bonalu festival: పాతబస్తీ బంగారు మైసమ్మ ఆలయ బోనాల ఉత్సవాలకు చెక్కుల పంపిణీ

ప్రవాస భారతీయుల మద్దతు: ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర కోశాధికారి డి. వాసుదేవరావు మాట్లాడుతూ.. రాంచందర్‌రావు నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుడని కొనియాడారు. యూఎస్ఏ ఆఫ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి అనుగుల, తెలంగాణ కన్వీనర్ విలాస్‌రెడ్డి జంబులా తదితరులు మాట్లాడుతూ.. జాతీయవాద భావజాలంతో ప్రవాస భారతీయులు ఎప్పుడూ బీజేపీకి అండగా ఉంటారని అన్నారు. ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనలో తమ వంతు పాత్ర పోషిస్తామని తెలిపారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి వందలాది మంది ప్రవాస భారతీయులు, బీజేపీ నాయకులు, వ్యాపారవేత్తలు హాజరై ప్రధాని మోదీ నాయత్వానికి పూర్తి మద్దతు ప్రకటించారు. అనంతరం నిర్వాహకులు ముఖ్య అతిథి రాంచందర్‌రావును ఘనంగా సన్మానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News