HomeతెలంగాణSIR: సర్‌ అంశం కేంద్రానికి సంబంధం లేదు.. ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దు- బీజేపీ చీఫ్‌

SIR: సర్‌ అంశం కేంద్రానికి సంబంధం లేదు.. ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దు- బీజేపీ చీఫ్‌

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు అన్నారు. SIR ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా ఎప్పటిలాగే జరిగే ప్రక్రియ అని వెల్లడించారు. ఎన్నికల సంఘంపై రాజకీయాలు చేయడం సరికాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/cinema-news/manchu-manoj-cleaned-the-tomb-of-dasari-narayana-rao/

ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అని రామచందర్‌ రావు పేర్కొన్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదన్నారు.

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/mock-fire-drill-at-nims-on-the-occasion-of-world-emergency-medicine-day/

‘ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేస్తుంది. దాని ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి నష్టం. ఓటమి భయంతోనే కొన్ని పార్టీలు ఈసీని టార్గెట్ చేస్తున్నాయి. ఎన్నికల కోడ్ అందరికీ సమానంగా వర్తిస్తుంది. నిబంధనలను గౌరవించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పక్షాలపై ఉంది.’- రామచందర్‌ రావు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News