HomeTop StoriesBRS- DGP: ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు.. డీజీపీని కలవనున్న బీఆర్‌ఎస్‌ కీలక నేతలు.!

BRS- DGP: ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు.. డీజీపీని కలవనున్న బీఆర్‌ఎస్‌ కీలక నేతలు.!

BRS Leaders to meet DGP: కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై జరిగిన దాడులను నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం నేడు డీజీపీ సీవీ ఆనంద్‌ను కలవనుంది. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యపై ఫిర్యాదు చేయనుంది. బీఆర్ఎస్ నేతలపై దాడులను అరికట్టాలని, శాంతిభద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేయనుంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/tvk-activists-protest-in-front-of-lok-bhavan/

గురువారం కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై దాడితో పాటు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేయడం వంటి ఘటనలు రాజకీయంగా కలకలం సృష్టించాయి. ఈ దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం డీజీపీని కోరనుంది. ఈ బృందంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో పాటు ఇతర ముఖ్య ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండే అవకాశం ఉంది.

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/young-man-brutally-murdered-in-chilakalguda/

కాగా, మాదకద్రవ్యాల వినియోగంపై కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిల మధ్య జరిగిన వాగ్వాదం ఈ దాడులకు దారితీసింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News