HomeతెలంగాణDelegation : శాసనసభ సాక్షిగా ఖాకీల జులుం: హస్తిన గడ్డపై గులాబీ సమరశంఖం

Delegation : శాసనసభ సాక్షిగా ఖాకీల జులుం: హస్తిన గడ్డపై గులాబీ సమరశంఖం

BRS delegation Delhi visit : శాసనసభ ప్రాంగణంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు చివరకు దేశ రాజధాని హస్తినకు పాకాయి. తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు ప్రవర్తించిన తీరుపై గులాబీ పార్టీ న్యాయపోరాటానికి దిగింది. నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ మహిళా ప్రతినిధులను అడ్డుకున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల బృందం గురువారం సాయంత్రం దిల్లీ పయనమైంది.

- Advertisement -

ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి తొలుత జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను (NHRC) కలవనున్నారు. అనంతరం జాతీయ మహిళా కమిషన్ (NCW) చైర్‌పర్సన్‌ను కలిసి రాతపూర్వక ఫిర్యాదును అందజేయనున్నారు.

శాసనసభ ప్రాంగణంలో మహిళా ప్రజాప్రతినిధులని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరు, తోసివేతలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను కమిషన్ల ముందు ఉంచనున్నారు. బాధ్యులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజాప్రతినిధుల హక్కులను పరిరక్షించాలని నేతలు డిమాండ్ చేయనున్నారు. రాష్ట్రంలో నిరసన గళాన్ని అణచివేస్తున్నారంటూ కేంద్ర కమిషన్ల ఎదుట ప్రభుత్వంపై పోరాటానికి గులాబీ దళం సిద్ధమైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News