HomeతెలంగాణWARANGAL: స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి

WARANGAL: స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి

WARANGAL: వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పిట్టకాలుబోడు తండా గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మండలంలోని విద్యోదయ హై స్కూల్ పాఠశాలకు చెందిన బస్సు చిన్నారి పైనుంచి వెళ్లడంతో మెదడు బయటపడి బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన తండావాసులను తీవ్ర విషాదానికి గురిచేసింది.

- Advertisement -

ALSO READ:  నేలపైనే భోజనాలు.. అరకొర వసతులతో అల్లాడుతున్న గిరిజన విద్యార్థులు

వివరాల్లోకి వెళితే అదే తండాకు చెందిన బాధవత్.రమేష్ -అఖిల చిన్న కుమారుడు బాధావత్ రాహుల్ (2) సంవత్సరాల బాలుడు ఉన్నాడు.ఉదయం 9 గంటల ప్రాంతాన తన ఇంటి ముందు ఆడుకుంటుండగా అటు నుంచి అతి వేగంగా వస్తున్న విద్యోదయ పాఠశాల బస్సు ఢీకొట్టింది. బాలుడి తల బస్సు టైరు కింద పడడంతో మెదడు బయటపడి రాహుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. తండావాసులు బస్సును అడ్డుకోవడంతో బస్సు డ్రైవర్ నరేష్, క్లినర్ సంఘటన స్థలం నుంచి పరారైనట్లు తండావాసులు తెలిపారు.

ALSO READ: తప్పిపోయిన బాలలను గుర్తించి అప్పగించిన దంతాలపల్లి పోలీసులు

బాలుడు మృతితో తల్లిదండ్రులు తండావాసులు బోరున విలపిస్తున్నారు. తండావాసులు బస్సు ను అడ్డుకొని రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ విషయం పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News