HomeతెలంగాణBus fire Accident: హైదరాబాద్‌-విజయవాడ హైవేపై బస్సు దగ్ధం.. డ్రైవర్‌ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

Bus fire Accident: హైదరాబాద్‌-విజయవాడ హైవేపై బస్సు దగ్ధం.. డ్రైవర్‌ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

Bus fire on Hyderabad-Vijayawada highway: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఓ ప్రైవేటు బస్సు దగ్ధమైంది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ 65)పై ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి కాకినాడ వెళ్తున్న బస్సులో తెల్లవారుజామున ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్‌, క్లీనర్‌ వెంటనే బస్సును నిలిపేసి ప్రయాణికులను కిందకి దింపారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్‌ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే, లగేజీ మొత్తం పూర్తిగా కాలి బూడిదైపోయింది. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న చిట్కాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Also read: Pawan kalyan: తెలంగాణలో జనసేన ఎంట్రీ.. అధినేత ప్రత్యేక ఫోకస్‌.. జూన్ 2న కీలక ప్రకటన..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News