Tuesday, February 17, 2026
HomeతెలంగాణDaughter killed parents: తల్లిదండ్రులను కడతేర్చిన కసాయి కూతురు.. ప్రేమకు అడ్డు వస్తున్నారనే కోపంతో దారుణం

Daughter killed parents: తల్లిదండ్రులను కడతేర్చిన కసాయి కూతురు.. ప్రేమకు అడ్డు వస్తున్నారనే కోపంతో దారుణం

Daughter who killed her parents: ఇటీవల విడుదలైన రాజు వెడ్స్‌ రాంబాయి సినిమాలో ఒక సంఘటన అందరినీ కంటతడి పెట్టిస్తుంది. కూతురు తనకు నచ్చని వాడిని ప్రేమించిందనే కోపంతో ఆమె తండ్రి హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ ఇవ్వడం తర్వాత ఆమె మరణించడం అందరినీ కంటతడి పెట్టిస్తుంది. సరిగ్గా ఇటువంటి ఓ సంఘటనే రియల్‌గా జరిగింది. మానవత్వం మరిచిన ఓ కూతురు తన ప్రేమకు తల్లిదండ్రులు అడ్డం వస్తున్నారనే కోపంతో వారికి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి పొట్టన పెట్టుకుంది. ఇప్పుడీ ఘటన తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లాలో సొంత తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేసింది ఓ ఉన్మాద కూతురు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువకుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన యువతి అతన్నే పెళ్ళి చేసుకుంటానంటూ పట్టుబట్టింది. ఒప్పుకోలేదని తల్లిదండ్రులను మట్టుబెట్టింది. బంటారం మండలం యాచారం గ్రామంలో ఉంటూ నర్సింగ్ హోంలో నర్స్‌గా విధులు నిర్వహిస్తున్న యువతి నక్క సురేఖకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. రెండేళ్లుగా వారు ప్రేమలో ఉన్నారు. ఇటీవల తల్లిదండ్రులకు విషయం చెప్పిన సురేఖ అతనితో తనకు పెళ్లిచేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేసింది. అయితే, వేరువేరు కులాలు కావడం.. ఇతరత్రా కారణాల వల్ల అతనితో వివాహానికి సురేఖ తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో తల్లిదండ్రులను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని కుట్ర చేసిన సురేఖ పక్కా ప్లాన్ తో వారిని మట్టుబెట్టింది. తాను పనిచేస్తున్న నర్సింగ్ హోమ్ నుండి అనస్థీషియా (మత్తుమందు) ఇంటికి తీసుకువచ్చింది. ఒళ్లు నొప్పులకు మందు తీసుకువచ్చాను.. ఇంజెక్షన్ చేస్తే తగ్గిపోతుందని తల్లిదండ్రులను మభ్యపెట్టింది. బిడ్డ తమ ఒళ్లు నొప్పులు తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని చూసి మురిసిపోయిన తల్లిదండ్రులు ఇంజెక్షన్ తీసుకునేందుకు సంతోషంగా ఒప్పుకున్నారు. అనుకున్న ప్రకారం ఎక్కువ మోతాదు ఉన్న మత్తుమందును ఇంజెక్షన్ ద్వారా వారి శరీరంలోకి ఎక్కించడంతో వారు నిద్రమత్తులోకి వెళ్లి.. అలాగే తుది శ్వాస విడిచారు. వారు చనిపోయిన విషయం నిర్ధారించుకున్న సురేఖ.. ప్లాన్ ప్రకారం డ్రామా మొదలు పెట్టింది.

- Advertisement -

గుండెపోటుతో మరణించినట్లు నాటకం..

గుండెపోటుతో తల్లిదండ్రులు మరణించారని ముందుగా తన సోదరుడికి ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పింది. బంధువులు చుట్టుపక్కలవాళ్లు అందరూ వచ్చిన తర్వాతా అందరిలోనూ కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఇద్దరు ఒకేసారి గుండెనొప్పితో మరణించడం ఎలా సాధ్యమనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో సోదరుడు తల్లిదండ్రుల మరణంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు నిర్వహించారు. దర్యాప్తులో భాగంగా ఘటనా స్థలంలో పడేసి ఉన్న వాడిపడేసిన సిరెంజీలు లభించాయి. వెంటనే సురేఖను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు ఘాతుకం బయటపడింది. తల్లిదండ్రులను తానే మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చిహత్య చేశానని.. ప్రియుడితో పెళ్ళికి అంగీకరించకపోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డానని చెప్పింది. దీంతో నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News