HomeతెలంగాణMusi revitalization: మూసీ పునరుజ్జీవంపై కీలక నిర్ణయం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు!

Musi revitalization: మూసీ పునరుజ్జీవంపై కీలక నిర్ణయం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు!

Cabinet sub-committee: రేవంత్‌ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ నది పునరుజ్జీవన (Musi Rejuvenation) ప్రాజెక్టు విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రాజెక్టు ప్రణాళికతో పాటుగా అమలును పర్యవేక్షించేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణా రావు జీవో నెం.406ను విడుదల చేశారు.

- Advertisement -

కేబినెట్ సబ్ కమిటీ కూర్పు: డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చైర్మన్‌గా ఈ సబ్‌ కమిటీ ఉండనుంది. సభ్యులుగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉండనున్నారు. కన్వీనర్‌గా మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) మేనేజింగ్ డైరెక్టర్‌ను నీయమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కమిటీ బాధ్యతలు: ఈ ఉన్నత స్థాయి కమిటీ ప్రధానంగా మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలను తీసుకోనుంది. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు కోసం వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం సాధించి.. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. భూసేకరణ, బాధితులకు పునరావాసం కల్పించడం మరియు నిధుల సమీకరణ వంటి కీలక అంశాలపై ఈ కమిటీ తుది నిర్ణయాలు తీసుకుంటుంది. నిర్ణీత కాలపరిమితిలోగా ప్రాజెక్టును పూర్తి చేసేలా పర్యవేక్షణ బాధ్యతలను ఈ కమిటీ నిర్వహిస్తుంది. ఈ కమిటీ ఏర్పాటుతో మూసీ సుందరీకరణ పనులు మరింత వేగవంతం కానున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News