హైదరాబాద్, సెప్టెంబర్ 7 (తెలుగుప్రభ): తెలంగాణ అసెంబ్లీ ఎదుట బీఆర్‌ఎస్ నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో పోలీసులపై దాడి చేసి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ గేటు వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పాటు, అనుచితంగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. పోలీసులను దుర్భాషలాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, సుధీర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అసెంబ్లీ పరిసరాల్లో జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన వీడియోలు, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.
పార్టీ ఎమ్మెల్సీలకు త్రీలైన్ విప్ జారీ చేసిన బీఆర్ఎస్
తమ పార్టీ ఎమ్మెల్సీలకు బీఆర్‌ఎస్ త్రీలైన్ విప్ జారీ చేసింది. నేటి సమావేశాలకు తప్పనిసరిగా రావాలని ఆదేశించింది. పార్టీ విధానం ప్రకారమే చర్చలో మాట్లాడాలని పేర్కొంది. బిల్లు, తీర్మానం, ఓటింగ్‌లో పార్టీ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది. విప్ ధిక్కరిస్తే.. అనర్హత వేటుకు దారితీస్తుందని హెచ్చరించింది.

