HomeతెలంగాణRation Rice: మండుతున్న ఎండలు.. ఒకేసారి 3 నెలల బియ్యం అందించేలా కేంద్రం ఆదేశాలు.!

Ration Rice: మండుతున్న ఎండలు.. ఒకేసారి 3 నెలల బియ్యం అందించేలా కేంద్రం ఆదేశాలు.!

Ration Rice Distribution in Telangana: తెలంగాణలో రేషన్‌ సరఫరా విషయంలో లబ్ధిదారులకు కేంద్రం తీపి కబురు అందించింది. వేసవికాలం దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఇబ్బందులు పడకుండా మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖలు రాసింది. ఈ నిర్ణయం ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రానుంది.  

- Advertisement -

Also Read: https://teluguprabha.net/top-stories/special-story-on-thetrue-friendship-p-between-telangana-cm-revanth-reddy-and-vem-narender-reddy/

ఈ ఏడాది వేసవికాలం ముందే మొదలైంది. మండిపోతున్న ఎండలతో ప్రజల బయటకు వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వేసవి దృష్ట్యా గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎండాకాలం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఇబ్బంది పడకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉపశమనం కలిగే వార్తను అందించింది. ఏప్రిల్ నుంచి అర్హులకు ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన(ఏప్రిల్, మే, జూన్‌) రేషన్‌ సరుకులను అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ లేక రాయగా.. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. 

కాగా, దేశంలో ఏ రాష్ట్రంలోలేని విధంగా ఒక్క తెలంగాణలోనే ఒక్కో రేషన్ కార్డు లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక.. కొత్త రేషన్ కార్డులను కూడా అందజేసింది. ఫలితంగా రాష్ట్రంలో రేషన్ కార్డు దారుల సంఖ్య కూడా పెరగ్గా.. ప్రస్తుతం కోటికిపైగా రేషన్ కార్డు దారులు ఉన్నారు. 

Also Read: https://teluguprabha.net/telangana/vem-narender-reddy-resigns-from-the-post-of-cm-advisor/

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో.. లబ్ధిదారులందరికీ ఒకే సారి మూడు నెలల రేషన్ ఇవ్వాలంటే భారీ మొత్తంలో దాన్యం నిల్వలు కావాలి. కాబట్టి రేషన్ పంపిణీకి సరిపడా బియ్యం కోటా నిల్వలు, సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే గతంలోనూ ఇదేవిధంగా ఒకసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం లబ్ధిదారులకు అందించింది. ఆ సమయంలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో స్టాక్ రావడంతో నిల్వ చేసేందుకు స్థలం లేక రేషన్‌ డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి తోడు సర్వర్ సమస్యలు కూడా ఎదురయ్యాయి. ఈ సారి అలాంటి సమస్యలు ఎదురవకుండా సర్కారు చర్యలు తీసుకుంటోంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News