HomeతెలంగాణMetro: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

Metro: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

Hyderabad Metro: హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో మరో భారీ మైలురాయి పడనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైదరాబాద్ మెట్రో రెండో దశ (Phase-2) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ ఉదయం దిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో కొనసాగుతున్న పలు ప్రాజెక్టులపై ఇరువురు మంత్రులు సుదీర్ఘంగా సమీక్షించారు.

- Advertisement -

డీపీఆర్ అందగానే తదుపరి చర్యలు: ఈ భేటీలో హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చ జరిగింది. దీనిపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి 162 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) అందిన వెంటనే కేంద్రం పరిశీలించి.. తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యం: ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం (50:50 రేషియోలో) నిధులు భరిస్తూ ఉమ్మడిగా ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దీంతో త్వరలోనే డీపీఆర్ ప్రక్రియ ముగిసి.. కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభిస్తే హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనులు వేగవంతం కానున్నాయి.

Also read-Supreme Court: ‘జన గణనలో కులగణన విధానపరమైన నిర్ణయం.. జోక్యం చేసుకోలేం’

ప్రభుత్వ పరిధిలోకి మొదటి దశ: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో ఇటీవల కీలక పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి దశ మెట్రోను ఇప్పటివరకు నిర్వహించిన ఎల్ అండ్ టీ (L&T) సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో సెకండ్ ఫేజ్ విస్తరణకు కేంద్రం నుంచి సూత్రప్రాయ అనుమతులు లభించడం నగర ప్రజలకు, ఐటీ కారిడార్ ప్రయాణికులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News