Wednesday, March 11, 2026
HomeతెలంగాణFarmer Registry: ఫార్మర్‌ రిజిస్ట్రీలో తెలంగాణ టాప్‌.. ప్రోత్సాహకంగా రూ. 424 కోట్లు మంజూరు చేసిన...

Farmer Registry: ఫార్మర్‌ రిజిస్ట్రీలో తెలంగాణ టాప్‌.. ప్రోత్సాహకంగా రూ. 424 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

Farmer Registry Telangana: తెలంగాణకు ప్రోత్సాహకంగా కేంద్రం రూ. 424 కోట్లు మంజూరు చేసింది. ఫార్మర్‌ రిజిస్ట్రీ పూర్తి చేసినందుకు ఈ ప్రోత్సాహకం అందించింది. దేశంలో 3 రాష్ట్రాలు ఈ ఘనత సాధించగా అందులో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు లక్ష్యాన్ని పూర్తి చేసినందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను అభినందించారు. 

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసినందుకు ప్రోత్సాహకంగా రూ. 424 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులు ఇప్పటికే రాష్ట్ర ఖజానాకు చేరాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఫార్మర్ రిజిస్ట్రీ లక్ష్యాన్ని పూర్తి చేసినందుకు అధికారులను అభినందించారు. 

Also Read: https://teluguprabha.net/crime-news/hyderabad-ccs-police-arrest-prasanna-kumar-in-matrimony-cyber-cheating-case/

కాగా, ప్రభుత్వ పథకాలు, రాయితీలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. రైతులందరూ పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ బాధ్యతను అప్పగించగా.. ఫార్మర్‌ రిజిస్ట్రీ చేయించుకున్న రైతులకు ఒక యూనిక్ ఐడీ క్రియేట్ అవుతుంది. ఆధార్ కార్డు వివరాల ఆధారంగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీ రైతులు చేయించుకోవాలి. ఈ నెంబర్ 11 అంకెలు ఉంటుంది. ప్రభుత్వ పథకం పీఎం కిసాన్ సాయం పొందాలన్నా, ఇతర రాయితీలు పొందాలన్నా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఐడీ పొందటం తప్పనిసరి చేసింది. 

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/unknown-person-entered-janasena-camp-office-and-attack-on-convoy/

ఇందుకోసం రైతులు అధికారులకు పట్టదారు పాసు బుక్, రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్, ఆధార్ అందించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 28గా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. సమీపంలోని రైతు సేవా కేంద్రాలను సందర్శించి ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. లేదంటే సమీపంలోని కామన్ సర్వీసెస్ సెంటర్లను సంప్రదించి ఈ ప్రక్రియ చేయవచ్చు. ఈ ఐడీ నెంబర్‌ను రైతులు భద్రంగా ఉంచుకోవాలి. కేంద్రం, రాష్ట్రం నుంచి విత్తన సబ్సిడీ, రుణాలు, నగదు లాంటివి అంతరాయం కలగకుండా పొందటంలో సహాయపడుతుంది. ప్రభుత్వ పథకాలన్నింటికీ ఇది కీలక ఆధారంగా దోహదపడనుంది. రైతులు గ్రామ ఏఈవోను సంప్రదించి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తీసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News