HomeTop StoriesChandrababu convoy: సీఎం చంద్రబాబుకూ తప్పని ట్రాఫిక్‌ కష్టాలు.. 10 నిమిషాల పాటు ఆగిన కాన్వాయ్‌

Chandrababu convoy: సీఎం చంద్రబాబుకూ తప్పని ట్రాఫిక్‌ కష్టాలు.. 10 నిమిషాల పాటు ఆగిన కాన్వాయ్‌

Chandrababu convoy stuck in Hyderabad traffic: అత్యంత భద్రత మధ్య ఉండే ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ హైదరాబాద్‌ ట్రాఫిక్‌లో చిక్కకుంది. రేపు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో పోలీసులు నిర్వహిస్తున్న ట్రయల్ రన్ కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. బంజారాహిల్స్ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, రేపు (ఆదివారం) ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో భాగంగా పోలీసులు బంజారాహిల్స్ మార్గంలో కాన్వాయ్ ట్రయల్ రన్ చేపట్టారు. అయితే, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్ అటువైపుగా వచ్చింది. దీంతో, ఆయన కాన్వాయ్‌ ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సుమారు 10 నిమిషాల పాటు ట్రాఫిక్‌లోనే ఆయన కాన్వాయ్‌ నెమ్మదిగా కదులుతూ ఉండిపోయింది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/viral/rakhi-sawant-shocking-comments-on-vijay-trisha/

ట్రాఫిక్‌ జామ్‌తో కిందకి దిగిన చంద్రబాబు..

ట్రాఫిక్ జామ్ తీవ్రంగా ఉండటంతో సీఎం చంద్రబాబు ఒకింత అసహనానికి లోనయ్యారు. కాసేపటి తర్వాత తన కారు నుంచి కిందకు దిగారు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కాసేపటి తర్వాత ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో చంద్రబాబు కాన్వాయ్ అక్కడి నుంచి ముందుకు కదిలింది. ఉన్నతాధికారుల మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వల్లే ఇలాంటి గందరగోళం తలెత్తినట్లు తెలుస్తోంది. అయితే, చంద్రబాబు కాన్వాయ్‌ ఆగిపోవడంతో ఆయనను చూసేందుకు జనం ఎగబడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News