HomeతెలంగాణChevella: చేవెళ్ల అభివృద్ధే లక్ష్యం: ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి

Chevella: చేవెళ్ల అభివృద్ధే లక్ష్యం: ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి

చేవెళ్ల, అక్టోబర్ 15 (తెలుగు ప్రభ): చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎంపీ ల్యాడ్స్‌ నిధులను విరివిగా వినియోగిస్తున్నట్లు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గానికి మొత్తం రూ.5.90 కోట్ల నిధులు కేటాయించగా, వాటిలో చేవెళ్ల మున్సిపాలిటీ, మండల పరిధిలోని అభివృద్ధి పనుల కోసం రూ.1.92 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని పల్గుట్టలో రూ.10 లక్షలు, మల్కాపురంలో రూ.10 లక్షలు, ధర్మసాగర్‌లో రూ.5 లక్షలు, దేవుని ఎర్రవల్లిలో రూ.18 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సమస్యల పరిష్కారం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ నిధులు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపడుతూ చేవెళ్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, చేవెళ్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దేవరి సమతా వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు మనీషా అనంత రెడ్డి, మినాక్షి సత్యనారాయణ, మాధవి యాదవ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పెద్దొళ్ల దయాకర్, గొల్లపల్లి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ మల్గారి వైభవ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అనంత్ రెడ్డి, నాయకులు సామ మాణిక్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News