Chicken shops bandh: రాష్ట్రవ్యాప్తంగా చికెన్ దుకాణాల బంద్ కొనసాగుతుంది. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచే వరకు నిరవధిక బంద్ కొనసాగిస్తామని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. గతంలో పార్టీ కంపెనీలు రిటైల్ దుకాణాలకు కిలోకు రూ. 26 మార్టిన్ ఇస్తూ వచ్చాయని చికెన్ షాప్ యజమానులు తెలిపారు. 20ఏళ్లుగా ఇదే కొనసాగినప్పటికీ.. ఇటీవల ఈ మర్జిన్‌ను రూ. 16కు తగ్గించారని అన్నారు.
మార్జిన్ రూ.30 ఇవ్వాలని డిమాండ్: మార్టిన్‌ను రూ. 26 నుండి 16కు తగ్గించడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చికెన్ విక్రయాల ద్వారా సరైన లాభాలు రావడం లేదని వాపోయారు. దీంతో దుకాణాలను నిర్వహించడం కష్టంగా మారిందని అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. కిలోకు కనీసం రూ.30 మార్జిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also read-Gas cylinder: సామాన్యుడికి గ్యాస్ షాక్.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే!
రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ దుకాణాల బంద్: మార్జిన్ పెంచే వరకు నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిస్తున్నట్లు వెల్లడించారు. తక్కువ మార్టిన్ కారణంగా వ్యాపారుల జీవనోపాధి సంక్షోభంలో పడిందని అన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ దుకాణాలు మూసివేసి ఉన్నాయి. దీంతో నాన్ వెజ్ ప్రియులు మటన్, ఫిష్ షాప్‌ల ముందు బారులు తీరారు.

