HomeTop StoriesCM Revanth Reddy: ఆ బాధ్యత పూర్తిగా కలెక్టర్లదే- ధాన్యం సేకరణపై సమీక్షలో సీఎం రేవంత్‌...

CM Revanth Reddy: ఆ బాధ్యత పూర్తిగా కలెక్టర్లదే- ధాన్యం సేకరణపై సమీక్షలో సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

CM Revanth Reddy- Collectors Meeting: రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు, వరి ధాన్యం సేకరణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రైతులు పండించిన వరి, మొక్కజొన్నలో ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/big-shock-for-non-veg-lovers/

ధాన్యం సేకరణలో జాప్యం జరగకుండా తగినన్ని లారీలను ఏర్పాటు చేయాలని, రవాణా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. హమాలీలు, రవాణా సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో వాట్సాప్‌ గ్రూపుల ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. సన్నవడ్లు పండించే రైతులకు క్వింటాలుకు రూ. 500 బోనస్ త్వరితగతిన అందేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.

‘ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో అక్రమాలకు పాల్పడకుండా, లోడింగ్ పూర్తి కాగానే వెంటనే రైతులకు రసీదులు అందజేయాలి. అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా రైతులకు సరిపడా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలి. గోదాముల్లో నిల్వ సామర్థ్యం పెంచేందుకు రైతు బజార్లు, ఫంక్షన్ హాళ్లను ప్రత్యామ్నాయంగా వాడుకోవాలి. ప్రతి ఐకేపీ కేంద్రం, రైస్ మిల్లు వద్ద పర్యవేక్షణ కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. మొక్కజొన్న కొనుగోలు బాధ్యతలను పూర్తిగా కలెక్టర్లే పర్యవేక్షించాలి. జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా మద్దతు ధర అందేలా చూడాలి. అవసరమైన చోట పోలీసుల సహాయం తీసుకుని ధాన్యం సేకరణ సాఫీగా జరిగేలా చూడాలి.’- సీఎం రేవంత్‌ రెడ్డి

Also Read: https://teluguprabha.net/ap-district-news/amaravati/minister-narayana-says-work-on-mla-and-mlc-quarters-in-final-stages/

ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, సీతక్క, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News