CM Revanth Comments on Bandi Sanjay: కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ కేసు వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ పారిపోవడం తప్పు అని, కేంద్రమంత్రి బండి సంజయ్ నైతిక బాధ్యత తీసుకుని కుమారుడిని అప్పగించాలని ఆయన కోరారు. అలా చేస్తే ఆయన గౌరవం పెరుగుతుందన్నారు. ఎలాంటి కేసులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని.. పారిపోతే సమస్యలకు పరిష్కారం దొరకదని హితవు పలికారు.
Also read: CM Revanth Reddy: 2034 తర్వాత జాతీయ రాజకీయాల్లో వెళ్తా.. అప్పటి వరకు నేనే సీఎం..!
తప్పయినా.. ఒప్పయినా పారిపోవొద్దు..
బండి సంజయ్ చాలా కింది నుంచి కష్టపడి పైస్థాయికి వచ్చిన నాయకుడని.. కుమారుడి కారణంగా ఆయనకు తలవంపులు వచ్చాయని సీఎం అభిప్రాయపడ్డారు. తప్పయినా.. ఒప్పయినా ఆయన నిలబడి సమాధానం చెప్పాలన్నారు. తక్షణమే కుమారుడిని పీఎస్‌లో అప్పగించాలని సూచించారు. ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సిట్ ఏర్పాటు చేశామని, ఎవరిది తప్పనే విషయాన్ని త్వరలోనే విచారణ అధికారులు తేలుస్తారన్నారు. బండి సంజయ్ తన కొడుకుని అప్పగిస్తే ఆయనకే గౌరవంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

