CM Revanth inspects lift irrigation project works in Maktal: పాలమూరు సాగునీటి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడమే లక్ష్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం కాట్రేవులపల్లి పరిధిలో కొనసాగుతున్న మక్తల్-నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను సీఎం, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులతో వివిధ అంశాలపై సీఎం చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సీఎం రేవంత్, మంత్రులు తిలకించారు.
Also Read: Belly Fat: పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడం లేదా?.. ఈ సింపిల్స్ టిప్స్‌తో చెక్ పెట్టండి
రెండ్రోజుల పాటు మహబూబ్‌నగర్‌లోనే..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం పర్యటన రెండ్రోజుల పాటు కొనసాగనుంది. ఇవాళ, రేపు రెండ్రోజుల పాటు సీఎం మహబూబ్‌నగర్‌లోనే పర్యటించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి, మక్తల్-నారాయణపేట- కొడంగల్, కల్వకుర్తి ఎత్తిపోతల, జూరాల, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, పంపుహౌస్‌లు, కాలువలు, డెలివరీ సిస్టర్న్‌ల పనులను పరిశీలించడంతో పాటు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. గతంలో పూర్తయిన ప్రాజెక్టులు, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులు, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి అధికారుల సమీక్షా సమావేశంలో వివరాలు తెలుసుకోనున్నారు. నేటి (గురువారం) మక్తల్ నుంచి ప్రారంభమైన సీఎం టూర్.. రేపటి (శుక్రవారం) జడ్చర్లలో భారీ బహిరంగ సభతో ముగియనుంది.

