Bandi Bhagirath Sai Case CM Revanth Reddy: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ సాయిపై నమోదైన పోక్సో కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ కేసు దర్యాప్తులో జరుగుతున్న ఆలస్యంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు డీజీపీ సీవీ ఆనంద్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana/pochampally-ikkat-at-paris-fashion-show/
మే 8న ఫిర్యాదు వచ్చినా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని పోలీసులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు తక్షణమే ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాజకీయ విమర్శలకు తావులేకుండా, ఎవరికీ పక్షపాతం చూపకుండా చట్టం ప్రకారం విచారణ పారదర్శకంగా జరగాలని స్పష్టం చేశారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమవ్వడం వల్లే విచారణలో కొంత ఆలస్యం జరిగిందని ముఖ్యమంత్రికి డీజీపీ సీవీ ఆనంద్ వివరించారు.
Also Read: https://teluguprabha.net/top-stories/cji-justice-surya-kant-launches-one-case-one-data/
మైనర్ బాలికను వేధించారన్న ఆరోపణలతో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. మరోవైపు, సదరు బాలిక కుటుంబం తనను హనీట్రాప్ చేసి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారంటూ భగీరథ్ కూడా కరీంనగర్‌లో కౌంటర్ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ రెండు కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు.

