CM Revanth on Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో అన్ని సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయని, భారీ మెజారిటీతో అత్యధిక స్థానాల్లో గెలువబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ (సోమవారం) పీఏసీ జూమ్ మీటింగ్‍లో పాల్గొన్న ఆయన మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. పార్టీ గుర్తులపై ఈ ఎన్నిలు జరుగుతున్నందున అందరూ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని తెలిపారు. అభ్యర్థులకు టికెట్ రికమండేషన్ చేసే నేతలు ఆయా అభ్యర్థుల గెలుపు బాధ్యతను భుజాన వేసుకొని గెలిపించాలని, వారి గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ లోకల్ మేనిఫెస్టోనూ సిద్ధం చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని, ఓటర్లందరినీ కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని కోరారు. అభ్యర్థులకు బీ-ఫామ్‍లు అందజేసే బాధ్యత డీసీసీ ప్రెసిడెంట్లు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో నేతలు బీసీ రిజర్వేషన్ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. బీసీలకు రాహుల్ గాందీ ఇచ్చిన మాట ప్రకారం రిజిర్వేషన్ ఇచ్చేలా కేంద్రం మీద ఒత్తిడి పెంచుతామని, కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కాగా, ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు.
Municipal Elections: సర్వేలన్నీ మనకే అనుకూలం.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ దిశానిర్ధేశం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

