Monday, March 16, 2026
HomeతెలంగాణCM Revanth Reddy: జలమండలికి శారదా పీఠం భూ కేటాయింపుపై సీఎం అసహనం.. కీలక ఆదేశాలు...

CM Revanth Reddy: జలమండలికి శారదా పీఠం భూ కేటాయింపుపై సీఎం అసహనం.. కీలక ఆదేశాలు జారీ

Revanth Reddy Sharada Peetham: జలమండలికి శారదా పీఠం భూముల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పీఠానికి కేటాయించిన భూముల్లో జలమండలి నిర్మాణ పనులు చేపట్టవద్దని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు భూముల కేటాయింపు తక్షణమే రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. 

- Advertisement -

హైదరాబాద్‌ శివారు కోకాపేటలోని శారదా పీఠానికి కేటాయించిన భూమికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి శనివారం కీలక ఆదేశాలు జారీ చేశారు. శారదా పీఠానికి కేటాయించిన ఈ భూముల్లో జలమండలి నిర్మాణ పనులు చేపట్టవద్దని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు భూముల కేటాయింపు తక్షణమే రద్దు చేయాలని స్పష్టం చేశారు. 

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/cm-chandrababu-announces-rs-20-lakhs-compensation-for-vetlapalem-deceased-families/

కాగా, శారదా పీఠం భూములను జలమండలికి కేటాయించడంతో అక్కడ నిర్మాణ పనులు చేపట్టగా.. ఈ విషయాన్ని శారదా పీఠం ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అధికారులపై అసహనం వ్యక్తం చేసిన రేవంత్‌ రెడ్డి.. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. పీఠం భూములను జలమండలికి కేటాయించిన సమయంలో అక్కడి నిర్మాణాల స్థితిని అధికారులు తెలియజేయకపోవడాన్ని సీఎం ప్రశ్నించారు. జలమండలికి ఈ భూ కేటాయింపులను రద్దు చేసి, శారదా పీఠానికే ఆ భూములు కొనసాగేలా ఆదేశాలు జారీ చేశారు.

హరీశ్‌ రావు ప్రశంసలు

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఆదేశాలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలు శుభపరిణామమని.. ఆయనకు అమ్మవారు ఇప్పటికైనా సరైన బుద్ధి ప్రసాదించారని ‘X’ వేదికగా పోస్ట్‌ చేశారు. 

Also Read: https://teluguprabha.net/national-news/sir-process-in-west-bengal-total-66-lakhs-voters-removed/

హరీశ్‌ చురకలు

కోకాపేటలో శారదా పీఠం భూములను జలమండలికి కేటాయించిన నిర్ణయాన్ని రద్దు చేయడం రాజ శ్యామలాదేవి అమ్మవారి కృపతో జరిగిన ధర్మ విజయం. ఇది  భక్తుల విజయం. ఆ అమ్మవారు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డికి సరైన బుద్ధి ప్రసాదించారు. 

అయితే ఈ విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డిని ప్రశంసిస్తూనే.. మరోవైపు హెచ్‌ఎండీఏ భూబదలాయింపులపై ఆయనకు హరీశ్‌ రావు సూటి ప్రశ్నలు వేశాలు. ఎలాంటి స్పష్టమైన ప్రజాప్రయోజన ప్రతిపాదిక లేకుండా పర్యావరణ నియమ నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తూ నామినేషన్ పద్ధతిలో కొందరికి హెచ్ఎండీఏ ద్వారా కేటాయించిన 17 ఎకరాల భూమి సంగతి ఏమిటని ముఖ్యమంత్రిని నిలదీశారు. ఆ భూమిలో కొనసాగుతున్న క్రషర్ యూనిట్‌ను తక్షణమే రద్దు చేయాలన్నారు. ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News