HomeTop StoriesCM Revanth Reddy: 'కడియం శ్రీహరి నీతి, నిబద్ధతను దేశంలో ఎవరూ ప్రశ్నించలేరు'

CM Revanth Reddy: ‘కడియం శ్రీహరి నీతి, నిబద్ధతను దేశంలో ఎవరూ ప్రశ్నించలేరు’

CM Revanth Reddy comments on MLA Kadiyam Srihari: ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యక్తిత్వాన్ని ఉద్దేశించి ఆదివారం అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి నీతిని, నిబద్ధతను ఈ దేశంలో ఎవరూ ప్రశ్నించలేరని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/top-stories/tvk-party-president-vijay-announces-candidates-for-the-tamil-nadu-assembly-elections/

కడియం శ్రీహరి మచ్చలేని రాజకీయ నాయకుడని, ఆయన నిబద్ధతను ఎవరూ శంకించలేరని సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పేర్కొన్నారు. శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి మధ్య జరిగిన వాగ్వాదం నేపథ్యంలో రేవంత్‌ స్పందించారు. కౌశిక్ రెడ్డి వైఖరిని తప్పుబడుతూ, కడియం వంటి సీనియర్ నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.

కడియం శ్రీహరి నీతి, నిబద్ధతను దేశంలో ఎవరు ప్రశ్నించలేరు. మచ్చలేని నాయకుడు కడియం శ్రీహరి. కేసీఆర్‌కు సమానంగా ప్రజా జీవితం నుంచి కడియం వచ్చారు. బీఆర్ఎస్ సభ్యుడి ప్రవర్తన సమర్థనీయమా.? అని కేటీఆర్, హరీష్ రావును అడుగుతున్నా. అసభ్యకరంగా, అసహ్యంగా ప్రవర్తిస్తే కేటీఆర్, హరీష్ సమర్థిస్తారా.?. ఇది మీ పార్టీ విధానమా?.. కేసీఆర్‌ను అవమానిస్తే మీరు ఊరుకుంటారా.?. కడియంకు జరిగిన అవమానమే కేసీఆర్‌కు ఎదురైతే పరిస్థితి ఏంటి.?. కౌశిక్ రెడ్డి ప్రవర్తనను  కేటీఆర్, హరీష్ సమర్థిస్తారా.?. కౌశిక్ రెడ్డిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.- సీఎం రేవంత్ రెడ్డి

Also Read: https://teluguprabha.net/telangana/nizamabad-news/three-laborers-die-in-road-accident-near-rampur-gadda/

ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తన పట్ల చూపిన గౌరవంపై కడియం శ్రీహరి భావోద్వేగానికి గురయ్యారు. రేవంత్ రెడ్డి తనకు ఇచ్చిన మద్దతును, గౌరవాన్ని మర్చిపోలేనని ఆయన అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News