Monday, March 16, 2026
HomeTop StoriesCM Revanth Reddy: '99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'.. కలెక్టర్లకు సీఎం...

CM Revanth Reddy: ’99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’.. కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం

CM Revanth Reddy- Collector Meeting:: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులను మెడికల్ కాలేజీలతో అనుసంధానం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ వైద్య సేవలను మెరుగుపరచడం, వైద్య విద్యార్థులకు క్షేత్రస్థాయిలో మెరుగైన శిక్షణ అందించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. సచివాలయంలో మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్‌ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు.  99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/tpcc-chief-mahesh-kumar-goud-clarity-about-rajyasabha-seats/

99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికపై చర్చలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం చేశారు. మార్చి 6 నుంచి జూన్‌ 12 వరకు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ మేరకు సమావేశంలో పలు కీలక విషయాలు వెల్లడించారు. 

‘అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలి. రేషన్‌ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలి. విద్యావ్యవస్థలో తీసుకువస్తున్న మార్పులపై అవగాహన కల్పించాలి. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లులు చెల్లించాలి.’ అని సీఎం రేవంత్‌ వెల్లడించారు. 

Also Read: https://teluguprabha.net/viral/haryana-holi-video-shows-men-pouring-alcohol-into-cows-mouth/

ప్రభుత్వ ఆస్పత్రులను మెడికల్‌ కాలేజీలతో అనుసంధానం చేయాలని ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డి మరోసారి ప్రస్తావించారు. మెడికల్ కాలేజీల పర్యవేక్షణలో అనుబంధ ఆస్పత్రులు పనిచేయడం ద్వారా వైద్య సేవల నాణ్యత పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, సీఎస్‌, ఉన్నతాధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News