HomeTop StoriesMinister Tummala: 'రూ. 1100 కోట్లతో జొన్న కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం'

Minister Tummala: ‘రూ. 1100 కోట్లతో జొన్న కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం’

Minister Tummala corn procurement:: రాష్ట్రంలో పంట కొనుగోలు విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వమే పంట కొనుగోలు చేపట్టాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఇప్పటికే రూ. 4 వేల కోట్లు కేటాయించామని.. అదనంగా మరో రూ. 1800 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. భారీ దిగుబడుల నేపథ్యంలో మొక్కజొన్న కొనుగోలుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిందన్నారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/suicide-attack-on-zafar-express/

రాష్ట్రంలో రూ.1,100 కోట్లతో జొన్నల కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారికంగా ప్రకటించారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ఓపెన్ మార్కెట్‌లో మద్దతు ధర లభించక ఇబ్బంది పడుతున్న అన్నదాతలకు ఈ మేరకు ప్రభుత్వం ఊరట కల్పించింది. 

Also Read: https://teluguprabha.net/sports-news/sachin-tendulkar-emotional-post-on-arjun-tendulkar-performance/

కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకొని స్వంత నిధులతో జొన్న, మొక్కజొన్న పంటల కొనుగోళ్లను చేపడుతోందని మంత్రి తుమ్మల అన్నారు. పొద్దుతిరుగుడు పంట కొనుగోలుపై ఉన్న 25 శాతం సీలింగ్ పరిమితిని మించి కొనుగోలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. జిల్లాల వారీగా జొన్న కొనుగోళ్ల ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా సాగించాలని ఈ మేరకు మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News