HomeTop StoriesKCR vs Revanth Reddy: ప్రజా పాలనో.. పాపాల భైరవుడో తేల్చుకుందాం- రేవంత్‌ రెడ్డి

KCR vs Revanth Reddy: ప్రజా పాలనో.. పాపాల భైరవుడో తేల్చుకుందాం- రేవంత్‌ రెడ్డి

KCR vs Revanth Reddy Politics: తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓ వైపు మాజీ ముఖ్యమంత్రి, మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి మధ్య బహిరంగ సభల్లో మాటల యుద్ధం నడిచింది. జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డి.. కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరగా.. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు, ఇతర అభివృద్ధి పనుల్లో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కాటారం మండలం నస్తూరపల్లిలో రెండో విడత రైతు భరోసా నిధులను సీఎం విడుదల చేశారు. అనంతరం బహిరంగ సభలో కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.  

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/kcr-comments-on-congress-government-in-jagtial-sabha/

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఊడగొడతామని సీఎం రేవంత్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు కాళేశ్వరంలో ముంచారని మండిపడ్డారు. కేసీఆర్‌కు ఉరివేసినా తప్పులేదని తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ను 100 మీటర్ల లోతులో పాతరేస్తామని హెచ్చరించారు. కార్యకర్తల సాక్షిగా చెబుతున్నా.. వచ్చే ఎన్నికల్లో తేల్చుకుందాం.. దమ్ముంటే రండి అంటూ కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి సవాల్ విసిరారు. 2034 వరకూ తెలంగాణలో కాంగ్రెస్‌ పాలన కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

Also Read: https://teluguprabha.net/telangana/jeevan-reddy-joins-brs-in-the-presence-of-kcr/

‘వరి వేస్తే ఉరే అని చెప్పి పంట కొనేది లేదన్న నేత మళ్లీ రావాలా. వాస్తు బాగా లేదని బాగున్న సచివాలయం కూల్చి కొత్తగా కట్టుకున్నారు. తండ్రి, బిడ్డ, కొడుకు ఇలా తలో ఫామ్‌ హౌజ్‌ నిర్మించుకున్నారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ఆలోచన మాత్రం వాళ్లకి రాలేదు. దొరల గడీల ముందు పేదలు ఊడిగం చేస్తూ ఉండాలని వాళ్లు భావించారు. వచ్చే ఎన్నికల్లో నువ్వో.. నేనో.. ప్రజా పాలనో.. పాపాల భైరవుడో తేల్చుకుందాం. మీ ఘోరీపై కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తాం. వైఎస్, డీఎస్‌లా.. నేను, మహేష్‌గౌడ్‌ చరిత్ర పునరావృతం చేస్తాం. ’- రేవంత్‌ రెడ్డి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News