HomeతెలంగాణCM Revanth Reddy: ఆరోగ్య రంగానికి నర్సులే వెన్నెముక.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ఆరోగ్య రంగానికి నర్సులే వెన్నెముక.. సీఎం రేవంత్ రెడ్డి

International Nurses Day: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నర్సులందరికీ సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో నర్సులు పోషిస్తున్న పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ఆధునిక నర్సింగ్‌ వ్యవస్థకు ఆద్యురాలైన ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌కు సీఎం నివాళులు అర్పించారు.

- Advertisement -

ఆరోగ్య రంగానికి నర్సులే వెన్నెముక: రోగులను కంటికి రెప్పలా కాపాడుతూ.. వారికి పునర్జన్మను ప్రసాదించడంలో నర్సుల కృషి అనన్యసామాన్యమని సీఎం పేర్కొన్నారు. వారి అంకితభావం, నిబద్ధత ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కొనియాడారు. వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ నర్సుల సేవాగుణం లేనిదే రోగి కోలుకోవడం అసాధ్యమని అన్నారు. అందుకే వారు ఆరోగ్య రంగానికి వెన్నెముకగా నిలుస్తున్నారని ప్రశంసించారు.

Also read-Education Week: విద్యావ్యవస్థలో నిర్మాణాత్మక సంస్కరణలు అవసరం- సీఎం రేవంత్‌

మానవత్వానికి ప్రతీకలు: నిస్వార్థ సేవే పరమావధిగా పని చేసే నర్సులు నిజమైన సేవామూర్తులని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. అచంచలమైన ధైర్యంతో.. మానవత్వంతో వారు అందిస్తున్న సేవలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తన సందేశంలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News