CM Revanth Reddy vs PM Modi: లోక్‌సభ సీట్ల పెంపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి సోమవారం మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మోదీకి రేవంత్ బహిరంగ లేఖ రాస్తూ పలు అంశాలను ప్రస్తావించారు.
Also Read: https://teluguprabha.net/lifestyle/why-lazy-girl-jobs-are-trending-with-gen-z/
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి ఒక బహిరంగ లేఖ రాశారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్లను పెంచితే, జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుతుందని.. తద్వారా తీవ్ర అన్యాయం జరుగుతుందని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పునర్విభజన ప్రక్రియతో ముడిపెట్టవద్దని.. ఈ ప్రక్రియను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ అంశంపై జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరగాలని రేవంత్ కోరారు. తక్షణమే అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని.. నియోజకవర్గాల పునర్విభజన కోసం తాను ప్రతిపాదించిన “హైబ్రిడ్ మోడల్”ను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

