HomeTop StoriesCM review: భారీ వర్షాలపై సీఎం సమీక్ష.. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం..!

CM review: భారీ వర్షాలపై సీఎం సమీక్ష.. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం..!

CM Revanth reddy reviews heavy rains: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు, ట్రాఫిక్‌, మున్సిపల్‌ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హైడ్రా, విద్యుత్‌, వాటర్‌ బోర్డు, సంబంధిత శాఖలు సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కబెట్టాలని ఆదేశించారుజ సీఎస్‌, డీజీపీ, క్యూర్‌ స్పెషల్‌ సీఎస్‌లతో సమీక్షించి నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా సత్వర చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాల్లో ముందస్తుగా టీమ్స్‌ మోహరించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Also read: KTR Comments: ధాన్యం కొనేందుకు గన్నీ బ్యాగులు లేవు.. ఉన్నవన్నీ ఢిల్లీకి పంపారు..! కేటీఆర్‌ సెటైర్లు

పోలీసులు హైఅలర్ట్‌లో ఉండాలి: డీజీపీ సీవీ ఆనంద్‌

మరోవైపు, హైదరాబాద్‌లోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటించారు. మల్కంపేట చెరువు, టోలిచౌకీల్లో పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. సైబరాబాద్ సీపీ రమేష్‌తో కలిసి నీటమునిగిన ప్రాంతాలు, ట్రాఫిక్ పరిస్థితులను సందర్శించారు. కీలక జంక్షన్లలో అదనపు పోలీసు సిబ్బందిని మోహరించాలని ఆదేశించారు. హైదరాబాద్‌తో పాటు వర్ష ప్రభావిత జిల్లాల పోలీసు అధికారులు హైఅలర్ట్‌లో ఉండాలని కోరారు. కాగా, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం (శనివారం) భారీ వర్షం కురిసింది. శంషాబాద్‌ వద్ద బెంగళూరు హైవేపై భారీగా వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత సిబ్బంది.. మోటార్ల ద్వారా నీటిని తొలగిస్తున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా విమానాలను సైతం దారి మళ్లించారు. షాద్‌నగర్‌లోనూ జాతీయ రహదారిపై భారీగా వరద వచ్చి చేరింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News