CM Revanth Reddy Comments On KCR: అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం, ఎమ్మెల్యే కేసీఆర్ హాజరు కాకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జీతం తీసుకుంటూ ఇంట్లోనే ఖాళీగా కూర్చుంటే ఎలాగని ప్రశ్నించారు. సిగ్గుంటే ఆయనతో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
దళితుడిని మైక్ కావాలని కోరాల్సి వస్తుందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సభకు రావట్లేదని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దళితులను కేసీఆర్ చిన్న చూపు చూస్తారని.. కనువిప్పు కలగాలనే ఎస్సీ వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్‌ను స్పీకర్‌ను చేసినట్లు పేర్కొన్నారు. దొర బిడ్డనై ఉండి దళితుడి ముందు కింద కూర్చోవాలా? అనే అహంకారంతోనే ఆయన అసెంబ్లీకి రావట్లేదని దుయ్యబట్టారు.
‘వయసు మీద పడిందని ఆయనను కొన్ని విషయాల్లో వదిలేశాం. జీతం తీసుకుంటూ ఇంట్లోనే కూర్చుంటే ఎలా.? బీఆర్‌ఎస్ నేతలకు సిగ్గుంటే ఆయనతో రాజీనామా చేయించాలి. కానీ సభకు వచ్చిన బీఆర్‌ఎస్ నేతల తీరు సరిగ్గా లేదు. పేదల కోసం పనిచేసే మా ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదం.’- సీఎం రేవంత్ రెడ్డి
Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-reddy-comments-on-kcr-kaleshwaram-project-issue/
కాగా, అక్రమ మైనింగ్‌పై అసెంబ్లీ చర్చ సందర్భంగా మంత్రి పొంగులేటితో పాటు తనపై బీఆర్‌ఎస్ నేతలు ఆరోపణలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ అక్రమాల్లో తమవారి ప్రమేయం ఉంటే ఆధారాలు సీబీసీఐడీకి ఇవ్వాలని సవాల్ విసిరారు. అదేవిధంగా పార్టీ ఫిరాయింపులనే దుష్ట సంప్రదాయానికి నాంది పలికింది కేసీఆర్ మాత్రమేనన్నారు. రూ. 1.10 కోట్ల జీతం తీసుకుని సభకు రాని బీఆర్‌ఎస్ అధినేతను రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

