HomeTop StoriesFuture City: ప్రపంచంతో పోటీ పడేలా భారత్‌ ఫ్యూచర్ సిటీ- సీఎం రేవంత్ రెడ్డి

Future City: ప్రపంచంతో పోటీ పడేలా భారత్‌ ఫ్యూచర్ సిటీ- సీఎం రేవంత్ రెడ్డి

Future City CM Revanth Reddy: భారత్‌ ఫ్యూచర్ సిటీని అధునాతన నగరంగా తీర్చిదిద్దాలన్నదే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ముచ్చర్ల ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఈ ఫ్యూచర్‌ సిటీలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం చేపడుతున్న కొత్త కమిషనరేట్‌ నిర్మాణానికి సీఎం ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాలుగో నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోందని రేవంత్‌ అన్నారు. ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని స్పష్టం చేశారు. మే నెలలో ఫ్యూచర్ సిటీ కార్యాలయం ప్రారంభిస్తామని వెల్లడించారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/cm-revanth-lays-foundation-stone-for-future-city-police-commissionerate-building/

‘హైదరాబాద్‌ను ప్రపంచానికి గేట్ వే గా మార్చే నగరం ప్రజా ప్రభుత్వం నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ. ప్రజల సహకారం, రైతుల త్యాగాలతో అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తాం. నూతన నగర నిర్మాణంలో నష్టపోతున్న ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత నాది. సామాన్యులు, పేదల విషయంలో అధికారులు మానవీయ కోణంలో ఆలోచన చేయాలి. ఫ్యూచర్ సిటీ నిర్మాణం అంత సులభం కాదు. అందరం కలిసి పనిచేస్తే ఫ్యూచర్ సిటీ నిర్మాణం సాధ్యమవుతుంది. ఫ్యూచర్ సిటీ భవిష్యత్ తరాలకు అద్భుతమైన నగరంగా రాణించే అవకాశం ఉంది. ’ -సీఎం రేవంత్ రెడ్డి

Also Read: https://teluguprabha.net/telangana/telangana-high-court-grants-bail-to-ys-bhaskar-reddy/

ఫ్యూచర్ సిటీ విషయంలో కొంతమందికి కష్టం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. సరైన నష్టపరిహారం రాలేదన్న బాధ కొందరి రైతుల్లో ఉందని.. వారందరికీ న్యాయం చేసేలా ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పోతున్న వారు డబ్బులు తీసుకుని కొంచెం దూరంలో భూమి కొనుకోవచ్చని సూచించారు. భూమి ఇస్తున్న రైతుల బాధలు వినాలని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులను సీఎం విజ్ఞప్తి చేశారు. పేదల విషయంలో అధికారులు కూడా మానవీయకోణంలో ఆలోచన చేయాలని పేర్కొన్నారు. రైతుల్లో అభద్రతాభావం లేకుండా అధికారులు భూసేకరణ చేయాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, డి. శ్రీధర్ బాబు, శాసన మండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, అనీల్ కుమార్ యాదవ్, MLA మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News