HomeTop StoriesCM Revanth Reddy: 2034 తర్వాత జాతీయ రాజకీయాల్లో వెళ్తా.. అప్పటి వరకు నేనే సీఎం..!

CM Revanth Reddy: 2034 తర్వాత జాతీయ రాజకీయాల్లో వెళ్తా.. అప్పటి వరకు నేనే సీఎం..!

CM Revanth Reddy sensational Comments: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2034లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి.. తాను మాత్రం జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పారు. అప్పటి వరకు తానే సీఎంగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే తన జీవిత లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి రాహుల్‌ తర్వాతి స్థానంలో ఉంటానని, కాంగ్రెస్‌లో నంబర్‌ 2 పొజిషన్‌లో ఉంటానని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడమే రాహుల్‌ గాంధీ లక్ష్యమని, ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. ఆయనకు ప్రధాని కావాలనే కోరిక లేనప్పటికీ.. ఆ పదవికి పోటీ పడాలని తాను ఒప్పించానని రేవంత్‌ గుర్తు చేశారు.

- Advertisement -

Also read: Dil Raju: టాలీవుడ్‌లో పర్సంటేజీ వివాదంపై కొనసాగుతున్న రచ్చ.. స్పందించిన దిల్ రాజు.. ఏమన్నారంటే?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News