Wednesday, March 11, 2026
HomeTop StoriesCM Revanth: మేం ఎన్ని పాలసీలు చేసినా.. అమలు బాధ్యత మీదే- సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth: మేం ఎన్ని పాలసీలు చేసినా.. అమలు బాధ్యత మీదే- సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy Group 1, 2: ప్రభుత్వం ఎన్ని పాలసీలు చేసినా.. దాని అమలులో ఉద్యోగుల పాత్రే కీలకమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఉద్యోగుల ద్వారానే ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతాయని వెల్లడించారు. హైదరాబాద్‌లో గ్రూప్‌- 1, గ్రూప్‌- 2 ఉద్యోగుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. 

- Advertisement -

group 1

Also Read: https://teluguprabha.net/top-stories/vijay-deverakonda-and-rashmika-mandanna-tie-the-knot-in-udaipur/

విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరబోతున్న గ్రూప్‌- 1, గ్రూప్‌- 2 నూతన ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని MCRHRD ప్రాంగణంలో శిక్షణా ముగింపు కార్యక్రమంలో సీఎంతో పాటు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, శిక్షణ పూర్తి చేసుకున్న 271 మంది గ్రూప్‌- 1, 171 మంది గ్రూప్‌- 2, 51 మంది మిలటరీ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ.. ఆధిపత్యాన్ని సహించబోరని రేవంత్‌ స్పష్టం చేశారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్‌- 1 పరీక్షలను విజయవంతంగా నిర్వహించి విజయం సాధించిన అభ్యర్థులకు నియామకపత్రాలు అందించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకున్నామని కోర్టులో లిటిగేషన్‌ పెట్టారని.. కానీ సర్కార్‌ ఒక్క తప్పు కూడా చేయలేదని స్పష్టం చేశారు. 

revanth reddy

Also Read: https://teluguprabha.net/gallery/vijay-devarakonda-rashmika-wedding-photos/

నిజాం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన చరిత్ర ఈ నేలది. సాయిధ రైతాంగ పోరాట స్ఫూర్తి మీకందరికీ తెలుసు. పోరాడి నేలకొరిగిన వీరుల స్ఫూర్తిగా ఉద్యోగులు బాధ్యతలు చేపట్టాలి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలి. ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షల్లో విజయమే లక్ష్యంగా, జీవితాశయంగా శ్రమించారు. లక్షలాది మందిలో ఎంపికయ్యారంటే మీరు మెరికల్లాంటి వాళ్లు. అని సీఎం రేవంత్‌ నూతన ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. 

group 2

బాగా చదువుకున్న వాళ్లను టీజీపీఎస్సీలో నియమించి అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించామని సీఎం రేవంత్‌ అన్నారు. అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరుతున్నారని.. ప్రభుత్వం వారినే ప్రతినిధులుగా భావిస్తోందన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగుల పాత్రే కీలకమని స్పష్టం చేశారు. గ్రూప్‌- 1, గ్రూప్‌- 2 ఉద్యోగులంతా బాధ్యతాయుతమైన పదవుల్లో చేరుతున్నారని.. పదవీ విరమణ వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. 

‘ఈ సమావేశంలో యాంత్రికంగా కాదు… ఒక భావోద్వేగ బంధంతో పాల్గొన్నాను. ముఖ్యమంత్రిగా కాదు, ఆ యువ బృందానికి పెద్దన్నగా వెళ్లాను. పేదరికం నేపథ్యం నుంచి, తల్లిదండ్రుల చెమట బిందువుల శ్రమ నుంచి స్ఫూర్తి తీసుకుని ఈ యువ అధికారులు ఎంపికై సొంత గడ్డకు సేవ చేయబోతున్నారన్న ఆలోచన అద్వితీయమైన అనుభూతిని ఇచ్చింది. వీళ్ల టాలెంట్‌ను తక్కువ చేస్తూ, ఆత్మగౌరవాన్ని అవమానిస్తూ కొన్ని దుష్టశక్తులు న్యాయ వ్యవస్థ ద్వారా వీళ్ల భవిష్యత్‌ను చీకటిమయం చేయాలని చేసిన ప్రయత్నాలను ప్రజా ప్రభుత్వం అదే న్యాయపోరాటం ద్వారా ఎదుర్కొని, విజయం సాధించింది. వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపిన క్రమం నాకు తృప్తిని ఇచ్చింది. ఈ యువ అధికారుల బృందం “గరం, నరం, బేషరం” నానుడి తప్పు అని రుజువు చేసి, కొలువులో చేరిన నాడు ఏవిధమైన అంకిత భావంతో ఉంటారో, ఉద్యోగ విరమణ నాడు అంతే అంకిత భావంతో పేదలకు సేవ చేయాలని, చేస్తారని విశ్వసిస్తున్నాను.’ అని రేవంత్‌ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News