CM Revanth Reddy about Gulf Countries: గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగువారికి సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. భద్రతా మార్గదర్శకాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇండియన్ ఎంబసీల సూచనలు, ఆదేశాలను పాటించాలని సూచించారు. తెలంగాణ వాసుల పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నామని.. సురక్షితంగా ఇక్కడకు రప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
Also Read: https://teluguprabha.net/international-news/russia-president-putin-condemns-khamenei-death/
గల్ఫ్ దేశాలు, ఇరాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న తెలుగు వారికి సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు జారీ చేశారు. అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలంతా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు ఎప్పటికప్పుడు ఇచ్చే భద్రతా సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప తెలుగు ప్రజలు నివాసాల నుంచి బయటకు రావద్దని స్పష్టం చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/rashmika-invites-cm-revanth-reddy-family-for-reception/
ఇరాన్, గల్ఫ్ దేశాల్లోని తెలుగు ప్రజలకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే, వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో నిరంతరం సమన్వయం చేసుకుంటుందని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, అధికారులు కూడా సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తెలంగాణ ప్రజల భద్రతే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు.

