Thursday, March 12, 2026
HomeTop StoriesCM Revanth Reddy: 'ప్రజలకు ధన్యవాదాలు.. ఈ అఖండ విజయం బాధ్యతను మరింత పెంచింది'

CM Revanth Reddy: ‘ప్రజలకు ధన్యవాదాలు.. ఈ అఖండ విజయం బాధ్యతను మరింత పెంచింది’

CM Revanth Reddy Municipal Elections: తెలంగాణ పుర ఎన్నికల్లో కాంగ్రెస్‌ అఖండ విజయం సాధించిందని సీఎం రేవంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు అని తెలిపారు. పార్టీ జెండా మోసి, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఈ విజయం అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/ktr-reaction-on-brs-result-in-municipal-elections/

రాష్ట్రంలో 116 మున్సిపాలిటీ స్థానాలకు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం కాంగ్రెస్‌ బాధ్యతను మరింత పెంచిందని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని వెల్లడించారు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్‌ కార్యకర్తలది అని కొనియాడారు. ఈ మేరకు ‘X’ వేదికగా ట్వీట్‌ చేశారు. 

Also Read: https://teluguprabha.net/telangana/congress-won-90-seats-in-municipality-elections/

‘అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు. రెండేళ్ల పాలన, అభివృద్ధిని చూసి ప్రజలు సంపూర్ణ తీర్పు ఇచ్చారు. కార్యకర్తలు భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోశారు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్‌ కార్యకర్తలది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ… భవిష్యత్తులో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లను గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం.’ అని సీఎం రేవంత్‌ రెడ్డి పోస్ట్‌ చేశారు. 

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌.. ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ప్రియాంకతో చర్చించినట్లు సీఎం ట్వీట్‌ చేశారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించ‌డం పట్ల హ‌ర్షం వ్య‌క్తం చేసి, అభినందనలు తెలిపినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News