HomeTop StoriesCM Revanth: నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి నిరసన!

CM Revanth: నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి నిరసన!

Kodangal: దిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్ట్‌ను నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నేడు ఉదయం 10 గంటలకు కొడంగల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించే భారీ నిరసన కార్యక్రమంలో స్వయంగా పాల్గొననున్నారు. నిన్న దిల్లీలో చోటుచేసుకున్న కాంగ్రెస్ అగ్రనేతల అరెస్ట్ ఘటనను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కొడంగల్‌లోని నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక నాయకులు పాల్గొననున్నారు. స్వయంగా సీఎం నిరసనకు దిగతుండడంతో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

జగ్గారెడ్డి అరెస్ట్:  ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్ట్‌కు వ్యతిరేకంగా సంగారెడ్డి కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిని దిగ్బంధించారు. జగ్గారెడ్డి పిలుపుతో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా పోతిరెడ్డిపల్లి జంక్షన్‌కు చేరుకుని రహదారిపై బైఠాయించారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా నేతలు నిరసన కొనసాగించారు. రహదారిపై టైర్లు తగలబెట్టి.. మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఎత్తున నినాదాలు చేశారు పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు జగ్గారెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వాహనంలోకి తరలిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వాహనాన్ని చుట్టుముట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులు అతికష్టం మీద కార్యకర్తలను పక్కకు తప్పించి, జగ్గారెడ్డిని సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News