CM Revanth’s sensational comments on KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ రద్దయిన రూ.1000 నోటుతో సమానమన్నారు. బీఆర్ఎస్‌కు గతమే తప్ప, భవిష్యత్ లేదని, ఆ పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలు, విమర్శలకు పైసా విలువలేదని కొట్టిపారేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నింటినీ తామే కట్టినట్లు చెప్పుకుంటున్న బీఆర్ఎస్.. ఒక్క ప్రాజెక్టునైనా మొదలు పెట్టి పూర్తి చేసిందో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు ప్రాజెక్టులను పూర్తి చేయడం కంటే ప్రాణిహిత – చేవెళ్ల ప్రాజెక్టు పేరు, ఊరు మార్చి దోపిడీ చేయడమే తెలుసన్నారు. కేసీఆర్ సొంతంగా మొదలుపెట్టి చేపట్టిన ప్రాజెక్టు రాష్ట్రంలో ఒక్కటీ లేదన్నారు. కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టుల విషయంపై అసెంబ్లీలోనే చర్చిద్దామని, నిజానిజాలు త్వరలోనే అందరికీ తెలుస్తాయన్నారు.
Also read: Hydra operation: పుప్పాలగూడలో హైడ్రా భారీ ఆపరేషన్.. రూ. 30 వేల కోట్ల విలువైన 200 ఎకరాలకు ఫెన్సింగ్
నీటి వివాదాల విషయంలో త్వరలోనే గుడ్ న్యూస్..
కృష్ణా, గోదావరి జలాలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నీటి పంపకాలపై ఏపీతో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే రాష్ట్ర ప్రజలు శుభవార్త వింటారని తెలిపారు. తెలంగాణకు రావాల్సిన చుక్కనీటిని కూడా వదులుకోబోమన్నారు. తాను పంచాయతీ కంటే పరిష్కారానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పాలమూరు, డిండి వంటి ప్రాజెక్టులకు ఎన్‌ఓసీలు వస్తేనే మిగతా ప్రాజెక్టులపై చర్చిస్తామని తేల్చి చెప్పారు.

