CMR Donation to TTD: తిరుమల తిరుపతి దేవస్థానం బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు సీఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ తెలంగాణ భారీ విరాళం సమర్పించింది. ఈ మేరకు టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరికి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ రూ. 10 లక్షల ఒక వెయ్యి 116 రూపాయల విలువైన చెక్కును అందజేశారు.
అనంతరం సీఎంఆర్ తెలంగాణ ఎండీకి టీటీడీ దేవస్థానం వారు స్వామి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారి భక్తుడు పరదాలమని ఆయన వెంట ఉన్నారు.
శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని టీటీడీ 2007లో ప్రారంభించింది. ఈ స్కీం ధార్మిక, ఆరోగ్య సేవా పథకం. ఈ పథకం ప్రధాన లక్ష్యం పేద, సామాన్య రోగులకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో అందించడం. ఈ పథకం కింద వచ్చే నిధులను తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో వైద్య పరిశోధనలు నిర్వహించడానికి, అర్హులైన రోగులకు చికిత్స అందించడానికి ఉపయోగిస్తారు.
Also Read: https://teluguprabha.net/sports-news/hyderabad-cp-sajjanar-warn-on-ipl-betting-apps/
నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, లెప్రోసోరియం (కుష్టు వ్యాధి నివారణ కేంద్రం), శారీరక వికలాంగుల కేంద్రం, నిరుపేదల గృహాలను కూడా టీటీడీ ఈ పథకం కింద నిర్వహిస్తోంది.

