Compensation to families of sunstroke victims: రాష్ట్రంలో ఎండ తీవ్రత, గరిష్ఠ ఉష్ణోగ్రతల నేపథ్యంలో వచ్చే మూడు రోజులు అందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. అవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో ఎవరూ బయటకి రావొద్దని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. ఎండలు, వడగాలుల అంశంపై సంబంధిత అధికారులతో మంత్రి నేడు అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్ల వద్ద మజ్జిగ, ఓఆర్‌ఎస్‌లు అందుబాటులో ఉంచాలన్నారు. వడదెబ్బతో మృతి చెందినవారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు.
Also Read: Green card rules: గ్రీన్‌కార్డుల జారీపై అమెరికా కొత్త రూల్స్.. వారికి మాత్రమే మినహాయింపు..!

